వివాదాలో గంగూలీ

SMTV Desk 2019-04-11 12:03:35  ipl 2019, dc, sourav ganguly

తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీపై వచ్చిన ఫిర్యాదు గురించి బీసీసీఐ అంబుడ్స్‌మెన్ విచారణ జరుపుతుండగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. కోల్‌కతా, ఢిల్లీ మధ్య మ్యాచ్.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం జరగనుండగా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో ఉన్న గంగూలీ.. పిచ్ క్యూరేటర్‌ని ప్రభావితం చేసే అవకాశం ఉందని బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌కి కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో.. గంగూలీపై విచారణ జరిపేందుకు అంబుడ్స్‌మెన్ సిద్ధమవగా.. మరోవైపు గంగూలీ మ్యాచ్ సమయంలో ఢిల్లీ టీమ్ డగౌట్‌లో కూర్చోవడానికి వీల్లేదని కొందరు కొత్త చర్చకి తెరలేపారు. అయితే.. గంగూలీని అలా కూర్చోవద్దని చెప్పే అధికారం బీసీసీఐకి లేదని ఓ అధికారి తాజాగా వెల్లడించారు. దీనిపై శుక్రవారంలోపు అంబుడ్స్‌మెన్ తుది నిర్ణయం వెల్లడించనున్నాడు.