త్వరలో అమెజాన్ లో ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్

SMTV Desk 2019-04-11 12:02:38  amazon, amazon flight bookings, food orders

ఈ కామర్స్ రంగ దిగ్గజం అమెజాన్ తమ వినియోగదారులకు కోసం మరో ముందడుగు వేయనుంది. త్వరలో తన యాప్‌ లో విమాన టికెట్ల బుకింగ్‌, ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ అవకాశాన్ని కల్పించనుంది. ఇప్పటికే ఈ కామర్స్‌ లో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్‌.. విమానయాన సేవలతోపాటు హోటల్స్ బుకింగ్స్, క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, తదితర సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా వినియోగదారులకు మరింత చేరువయ్యేలా చూస్తోంది. దీని కోసం టోప్జో(బహుళ సేవలు) యాప్‌ను వినియోగించుకోనుంది. భారత్‌ లో స్టార్టప్ కంపెనీ టోప్జో తన సేవలను అందిస్తోంది. గత సంవత్సరమే టోప్జోను అమెజాన్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ వార్తలపై అమెజాన్‌ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.