బీచ్‌లో సేల్ఫీ...మరణ శిక్షే

SMTV Desk 2019-04-11 11:58:24  thailand, thailand Phuket beach, Plane Spotting in Phuket, runway near the beach

థాయిలాండ్‌: థాయిలాండ్‌లోని పూకెట్ ద్వీపంలోని బీచ్‌లో ఫోటోలు తీసుకుంటే మరణ శిక్ష విధించాలని ప్రభుత్వం అనుకుంటుంది. పూకెట్ ద్వీపంలోని మాయ్ ఖావో బీచ్‌కు ఆనుకునే ఫూకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే ఉంది. ఇక్కడ విమానాల రన్ వే బీచ్‌కు అత్యంత సమీపంగా ఉంది. దీంతో విమానాలు గాలిలోకి ఎగిరినప్పుడు బీచ్‌లో ఉన్న పర్యాటకుల తలకు అత్యంత దగ్గర నుంచి వెళుతునట్టుగా కనిపిస్తాయి. దీంతో అక్కడికి వచ్చే పర్యాటకులు విమానాలు వారి తలలుపై నుంచి వెళుతునట్టుగా పోజులు ఇచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఇది అటు విమానాలకు ఇటు పర్యాటకులకు ప్రమాదకరంగా మారింది. దీంతో ఈ బీచ్‌ను సేఫ్ జోన్‌గా పరిగణించి సెల్ఫీలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిబంధనలను అతిక్రమించిన వారికి మరణ దండన లేదా జీవిత ఖైదు లేదా రూ.70 వేలు పైగా జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు అక్కడ ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బీచ్‌లో సెల్ఫీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని.. ప్రభుత్వం వాటిని నిషేధిస్తే పర్యాటకులు ఇక్కడికి రారని దీంతో వారు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.