రాష్ట్ర వ్యాప్తంగా భారీ నగదు స్వాధీనం

SMTV Desk 2019-04-11 11:55:24  elections, illegal money, hyderabad langar house

హైదరాబాద్: పార్లిమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.71 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లంగర్ హౌజ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేయడంతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం సీజ్‌ చేశారు. ఈ డబ్బు పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. అటు వికారాబాద్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. వికారాబాద్ పట్టణం రాజీవ్ నగర్ చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. హైదరాబాద్ నుంచి తాండూర్ కు తరలిస్తున్న కారులో 1.50 కోట్లను పోలీసులు పట్టుకున్నారు. కారు డ్రైవర్ సురేశ్ ను విచారించగా పోస్టల్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన డబ్బు అని వెల్లడించారు. డబ్బుకు సంబధించి సరైన ఆధారాలు లేకపోవడంతో డీఎస్పీ శిరీష డబ్బును సీజ్ చేశారు. వాహనాల తనిఖీల్లో నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బెల్‌తరోడా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద 28 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. భైంసా నుంచి మహారాష్ట్రలోని లోహా పట్టణానికి కారు లో శివప్రసాద్, జ్ఞానేశ్వర్, దశరథ్, విఠల్ అనే వ్యక్తులు నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.