ఆది 'బుర్రకథ' మోషన్ పోస్టర్ రిలీజ్

SMTV Desk 2019-04-11 11:54:30  aadi, burrakatha, burrakatha motion poster

హైదరాబాద్: సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా నటిస్తున్న కొత్త సినిమా బుర్రకథ . ఈ సినిమా మోషన్ పోస్టర్ ను బుధవారం విడుదల చేశారు. ఇందులో ఆదిని డ్యూయల్ షేడ్ లో చూపించారు. స్పోర్ట్స్, స్టార్స్, హ్యబిట్స్ కి సంబంధించి పలు టైటిల్స్ ని మోషన్ పోస్టర్లో చూపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మిష్టి చక్రవర్తి ,నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచం సాంకేతికంగా ఎంతో పురోగమిస్తోందని, ల్యాండ్‌ ఫోన్‌ నుంచి ఐఫోన్‌దాకా వచ్చామని, కానీ మనుషుల మనస్తత్వాలు మాత్రం మారలేదని, మనుషులు కూడా అప్‌డేట్‌ కావాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా సాగే నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.