బోల్డ్ యాక్టర్ తో....ఎమోషనల్ హిట్స్ డైరెక్టర్

SMTV Desk 2019-04-10 16:04:31  shiva nirvana, vijay devarakoda, majili, ninnu kori

నిన్ను కోరి, మజిలీ వంటి ఫీల్ గుడ్ హిట్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ నెక్స్ మూవీ ఎవరితో అనే విషయంలో అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. ఇటీవల కాలంలో సున్నితమైన భావోద్వేగాలను ఇంత చక్కగా ప్రజెంట్ చేసిన దర్శకుడు లేకపోవడంతో శివకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తోంది. తాజా సమాచారం ప్రకారం శివ నిర్వాణతో సినిమా చేసేందుకు యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. అయితే ‘మజిలీ’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న శివ నిర్వాణ నెక్స్ సినిమాకు కొంత సమయాన్ని తీసుకోనున్నాడు. ‘నిన్ను కోరి’ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న శివ ఇప్పుడు కూడా తర్వాత సినిమాకు అంతే సమయాన్ని తీసుకున్నా ఆశ్చర్యం లేదు. కథ ఏదైనా దాని స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే శివ నిర్వాణ నెక్స్ సినిమా యంగ్ స్టార్ విజయ్ దేవరకొండతో ఓకే అయితే ఆ కాంబోకు వచ్చే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.