కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడ్వొకేట్ అరెస్ట్

SMTV Desk 2019-04-10 15:57:54  Konda vishweshar reddy, rahul gandhi, advocate arrest

హైదరాబాద్: తాజాగా టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళిన చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడ్వొకేట్ సందీప్ రెడ్డిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్‌లో సందీప్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర నుండి రూ.10 లక్షలతో పాటు మూడు ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి సందీప్ రెడ్డిని ఐటీ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. సందీప్ రెడ్డి ఇప్పటికే రూ.15 కోట్లను ఎన్నికల్లో పంచినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సందీప్ రెడ్డి ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారనే విషయమై పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు సందీప్ రెడ్డి నుండి కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. సందీప్ రెడ్డి కోడ్ పద్దతిలో రాసుకొన్న కాగితాలను పోలీసులు డీ కోడ్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సమీప బంధువుగా చెబుతున్నారు.