కల్కి ఇంట్రెస్టింగ్ టీజర్

SMTV Desk 2019-04-10 15:50:32  kalki, garuda vega, aa, dr. rajashekhar

హైదరాబాద్: చాలా గ్యాప్ తరువాత గరుడ వేగ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ తన రేంజ్ ను గుర్తుచేసిన హీరో డా. రాజశేకర్. ఈయన ప్రస్తుతం కల్కి అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపోందిస్తున్నారు. ఇది 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు. సినిమా బాధ్య‌త‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ మోస్తున్నాడు. ‘అ!’ త‌ర్వాత మరో మంచి హిట్ వ‌స్తుంద‌ని అంటున్నారు నిర్మాత. కల్కి చిత్రంలో నుంచి ఇటీవల ఓ టీజ‌ర్‌ రిలీజ్ చేసి మూవీ ఫై భారీ అంచనాలు పెంచిన చిత్ర బృందం. తాజాగా మరో టీజ‌ర్‌ విడుదల చేసింది. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకి సినిమాఫై ఆసక్తిని మరింత రెట్టింపు చేస్తున్నాయి. చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా, అందులో ఒక‌రు అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ ఫేం నందిత శ్వేతలు నటిస్తున్నారు. ఈ టీజర్ పై మీరు ఓ లుక్ వేయండి.