న్యూలుక్ లో ప్రియా ప్రకాశ్ వారియర్

SMTV Desk 2019-04-10 15:42:57  priya prakash varrier, sneha ullal, bigg boss 12 contestant

ముంబై, ఏప్రిల్ 10: ఒక్కసారి కన్నుగీటి, దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్, తన లవర్స్ డే తో మెప్పించలేక పోయినా, అందచందాలతో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా, ఓ కమర్షియల్ యాడ్ కోసం ప్రియా ప్రకాశ్ పనిచేసింది.

ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా, వాటిల్లో ప్రియ మరింత గ్లామరస్ గా కనిపిస్తోందని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. ఈ యాడ్ లో ప్రియతో పాటు దక్షిణాది హీరోయిన్ స్నేహా ఉల్లాల్, బిగ్ బాస్ సీజన్ 12 పోటీదారు కృతీ వర్మ కూడా కనిపిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని మీరూ చూడండి.