అరవై ఏళ్ల వయసులో ఇదేం పాడు బుద్ధి!!

SMTV Desk 2019-04-10 15:41:59  sexual harassment, grand father age, minor girls, michael siril head

పెర్త్, ఏప్రిల్ 10: "తాతయ్యా.. నన్ను రోడ్డు దాటించవా.." అంటూ తన వద్దకు వచ్చే చిన్న పిల్లలను చిరునవ్వుతో పలకరిస్తూ.. పిల్లల తల్లిదండ్రుల నమ్మకాన్ని కూడా పొందాడా అరవై ఏళ్ల వ్యక్తి. అతని పేరు మైకేల్ సిరిల్ హైడ్. పెర్త్‌లోని ఓ స్కూల్లో చిన్న పిల్లలన రోడ్డు దాటించే ఉద్యోగం చేసేవాడు.

చాలా మంచి వాడిగా అందరికీ తెలిసిన మైకేల్‌లో.. ఎవరికీ తెలియని మరో రాక్షసుడు కూడా ఉన్నాడు. అతన్ని ఎవరూ గమనించనప్పుడు ఆ రాక్షసుడు మేల్కొంటాడు. తన వద్దకు వచ్చే చిన్న పిల్లలకు చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపి వారితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. వారి మర్మావయవాలను తడిమి.. వికృతానందం పొందడం, ఆ వికృత చేష్టలను వీడియోలో బంధించడం అతనికలవాటు.

చాలా కాలం ఈ విషయం బయటపడలేదు. ఎట్టకేలకు ఓ అమ్మాయి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ ఘోరం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. మైకేల్ ఇంటిపై దాడి చేశారు. అతని ఇంట్లో లభించిన కెమెరాలు, కంప్యూటర్లు వంటి పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.

వాటిలో ఉన్న వీడియోల ద్వారా అతను చాలామంది చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. అలాగే వారి ఇంటి సమీపంలో ఉండే ఓ ఏడేళ్ల అమ్మాయి, ఆరేళ్ల ఆమె చెల్లితోపాటు ఆరేళ్ల వయసున్న వారి సోదరుడితో కూడా మైకేల్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్పష్టమైంది. మరో కుటంబానికి చెందిన ఏడాది పసిపాపపై ఆమెకు నాలుగేళ్లు వచ్చే వరకు లైంగిక దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు.

వీటన్నింటికీ కెమెరాలో బంధించిన మైకేల్.. ఆ తర్వాత ఆ వీడియోలను చూస్తూ వికృతానందం పొందేవాడు. కొన్ని గంటలపాటు మైకేల్ వద్దనున్న వీడియోలను కోర్టుకు చూపించిన ప్రాసిక్యూటర్.. బాధిత పిల్లలను మళ్లీ కోర్టుకు పిలిపించి ప్రశ్నించనవసరం లేదని, ఆ వీడియోలే పిల్లల తరఫున మాట్లాడుతున్నాయని చెప్పారు.