బౌద్ధ గురువు దలైలామాకు అస్వస్థత

SMTV Desk 2019-04-10 11:02:16  buddha guruvu, dalailama, delhi hospital

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: బౌద్ధ గురువు దలైలామా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్ తో ఆయన బాధ పడుతున్నారు. దీంతో,ఆయనను ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని దలైలామా అధికార ప్రతినిధి తెన్ జిన్ తక్లా చెప్పారు. ఒకటి, రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే దలైలామా ఉంటారని తెలిపారు.