టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై...

SMTV Desk 2019-04-10 10:46:03  csk vs kkr, ipl 2019

చెన్నై: ఐపీఎల్ 2019 సీజన్‌లో ఈరోజు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ను ఎంచుకుంది. టోర్నీ ఆరంభం నుంచి సులువుగా విజయాల్ని అందుకుంటున్న చెన్నై జట్టు కెప్టెన్ ధోని సిక్సర్ల సునామీతో కోల్‌కతాకి ఒంటిచేత్తో విజయాల్ని అందిస్తున్న ఆండ్రీ రసెల్‌ను ఎలా కట్టడి చేస్తాడో అని అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. తాజా సీజన్‌లో ఇప్పటి వరకూ 5 మ్యాచ్‌లాడిన కోల్‌కతా జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. చెన్నై జట్టు కూడా ఓడింది ఒక్క మ్యాచ్‌లోనైనా.. నెట్‌ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా +1.058 నెట్‌ రన్‌రేట్‌తో ఉండగా.. తర్వాత చెన్నై +0.159తో ఉంది. మొత్తంగా.. రెండు జట్లూ మంచి సమతూకంగా కనిపిస్తుండటంతో.. మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.


Kolkata Knight Riders (Playing XI): Chris Lynn, Sunil Narine, Robin Uthappa, Nitish Rana, Dinesh Karthik(w/c), Shubman Gill, Andre Russell, Piyush Chawla, Kuldeep Yadav, Harry Gurney, Prasidh Krishna.

Chennai Super Kings (Playing XI): Shane Watson, Faf du Plessis, Suresh Raina, Ambati Rayudu, MS Dhoni(w/c), Kedar Jadhav, Ravindra Jadeja, Scott Kuggeleijn, Deepak Chahar, Harbhajan Singh, Imran Tahir.