బ్లాక్ మేజిక్ ఎఫెక్ట్...తమ్ముని మర్మాంగాలు కోసుకొని తిన్న అక్క

SMTV Desk 2019-04-10 10:35:22  black magic, brazil, sister kills her brother and his penis,

ఓ యువతి మానవాతీత శక్తులు పొందాలనే కోరికతో దారుణానికి ఒడిగట్టింది. బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ తన కూతురు, కొడుకుతో కలిసి నివాసముంటుంది. 18 ఏళ్ల కూతురుకి చిన్నతనం నుంచి క్షుద్రపూజలంటే ఎంతో ఆసక్తి. మానవాతీత శక్తులు పొందాలని ఎంతో ఆసక్తిగా వీడియోలు చూసేది. వయస్సుతో పాటు తనలో మూఢనమ్మకాలు కూడా విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ రోజు తల్లి మార్కెట్‌కు వెళుతూ 5 ఏళ్ల తమ్ముడిని చూసుకోమని చెప్పింది. తమ్ముడితో ఆడుతున్న సమయంలో ఆమెలో దాగివున్న మూఢనమ్మకం నిద్రలేచింది. దీంతో తమ్ముడిని వీడియో గేమ్ ఆడదామని తన బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లింది. గదిలోకి తీసుకెళ్లి, తమ్ముడిని దిండుతో ఊపిరాడనివ్వకుండా చంపేసింది. తర్వాత అతడి మర్మాంగాలను కోసుకుని తినేసింది. తమ్ముడి శవం చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి మధ్యలో కూర్చొని పూజలు చేసింది. ఇంతలో మార్కెట్ నుండి తిరిగివచ్చిన తల్లి లోపల కనిపించిన దృశ్యాలను చూసి షాకైంది. స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గదిలో డ్రగ్స్ దొరకడంతో డ్రగ్స్ మత్తులో ఇలా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.