కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించు!!!

SMTV Desk 2019-04-10 10:34:02  ipl 2019, rcb, virat kohli, rohit sharma, gambhir, mi

బెంగళూరు: ఐపీఎల్ 2019 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క విజయాన్ని కూడ సొంతం చేసుకోలేదు. జట్టులో నైపుణ్యం కలిగిన ఆటగాల్లున్నప్పటికీ ఓటమి బాటే పడుతుంది. అయితే ఈ వరుస ఓటమిల వల్ల అందరి దృష్టీ ఆ జట్టు సారథ్యంపై పడింది. జట్టు సారథి విరాట్ కోహ్లీపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల సందర్భంగా విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తిన వారే ఇప్పుడు అతనిపై విమర్శలు కురిపిస్తుండడం గమనార్హం. ఇప్పటికే గౌతమ్ గంభీర్‌తో పాటుగా పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు చేస్తున్నారు. ఐపిఎల్ ప్రభావం ప్రపంచకప్‌పై పడకుండా ఉండాలంటే కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రపంచకప్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అంటున్నారు. రోహిత్ శర్మ ముంబయి జట్టును మూడు సార్లు ఐపిఎల్ విజేతగా, ఒక సారి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలబెట్టాడు. మరోవైపు భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా రోహిత్ శర్మకు ఉందని వారు అంటున్నారు. మాజీ క్రికెట్ దిగ్గజం మైఖేల్ వాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ ‘భారత జట్టు తెలివైనదైతే ప్రపంచకప్ సారథ్య బాధ్యతలనుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించాలి’ అని వ్యాఖ్యానించారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం కోహ్లీ ఎప్పటికయినా ఉత్త కెప్టెన్‌గా రాణిస్తాడన్న అశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకుంటే బెంగళూరు జట్టు కూడా విజయాలు సాధిస్తుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.