కేసీఆర్ ను విమర్శించినందుకు బాబుపై జగన్ ఆగ్రహం

SMTV Desk 2019-04-09 18:15:21  ysrcp, ycp, jagan, ap poll, kcr, trs

తిరుపతి, ఏప్రిల్ 09: ఏపీకి ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇచ్చినప్పటికీ ఆయన దొంగ అని చంద్రబాబు అంటున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన చివరి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ....కేసీఆర్ అంటే చంద్రబాబుకు పడదని, అందుకు, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై మద్దతు ఇస్తానన్న కేసీఆర్ ని దూషిస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై మద్దతు ఇస్తున్న టీఆర్ఎస్ ను స్వాగతించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే మన రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలతో పాటు పక్క రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కూడా కలిస్తే ప్రయోజనం ఉంటుందని, ఈ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోవట్లేదని అన్నారు.

ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలన దారుణంగా ఉందని విమర్శించారు. బాబు పాలనలో అన్ని సంక్షేమ పథకాలు ఓ మూలనపడ్డాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే స్వర్ణయుగం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. నవరత్నాలు అమలు చేసి ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు.