గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు!

SMTV Desk 2019-04-09 18:10:30  loksabha elections, election commission of india, telangana, identity card, adhar card

హైదరాబాద్: ఈ ఎన్నికల పోలింగ్ సమయంలో ఫొటో ఓటర్ స్లిప్‌లను గుర్తింపు కార్డులుగా పరిగణించడం లేదని సిఇఒ స్పష్టం చేశారు. ఇసిఐ ఆదేశాల మేరకు ఎపిక్ (ఓటరు గుర్తింపు) కార్డు లేదా మరో 11 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కింద పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తమ వెంట తీసుకరావాలని ఆయన చెప్పారు. 1) పాస్‌పోర్ట్, 2) డ్రైవింగ్ లైసెన్స్, 3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రభుత్వరంగ సంస్థలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగుల ఫొటో గుర్తింపుకార్డు, 4) బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోతో సహా జారీచేసిన పాస్ పుస్తకాలు, 5) పాన్‌కార్డు, 6) ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్‌కార్డు, 7) నరేగా జారీ చేసిన ఉపాధిహామీ పత్రం, 8) ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీచేసిన స్మార్ట్‌కార్డ్, 9) ఫొటోజత చేసి ఉన్న పింఛన్ పత్రాలు, 10) ఎంపి/ ఎంఎల్ఎ/ ఎంఎల్ సిలు జారీచేసిన అధికారిక గుర్తింపు పత్రం, 11) ఆధార్ కార్డులలో ఏదో ఒక గుర్తింపుకార్డు చూపించినవారిని మాత్రమే ఓటు వేయనిస్తారని సిఇఒ వెల్లడించారు.