సెంట్రల్ లో బిజెపి....స్టేట్ లో టీఆర్ఎస్

SMTV Desk 2019-04-09 17:18:06  trs, bjp, poll, elections

న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో మరోసారి బిజెపినే అధికారంలోకి రానుంది అని ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చిన అన్ని ఒపీనియన్ పోల్స్ సారాంశం ఒక్కటే. రెండు నెలల్లో బిజెపికే మద్దతు ఎక్కువగా ఉంది. అయితే 2014 ఎన్నికల్లోలాగా సింగిల్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ మాత్రం రాదని ఒపీనియన్ పోల్ తో తేలిపోయింది. గత ఎన్నికల్లో బిజిపి సొంతంగా 282 స్థానాల్లో గెలవగా.. ఈసారి 228 స్థానాలకు పరిమితం కానుంది. అలాగే కాంగ్రెస్‌కు ఈసారి 88 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చి చెప్పింది. ఇక తెలంగాణలో టిఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 17 స్థానాలకు గాను టిఆరెస్ 14 గెలిచే అవకాశం ఉన్నట్లు ఒపీనియన్ పోల్ తేల్చింది.