ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో సిద్ధార్థ్ దేశాయ్ రికార్డు

SMTV Desk 2019-04-09 17:16:17  PKL Auction,Telegu Titans,Siddharth Desai

ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో తెలుగు టైటాన్స్ జట్టులో రాహుల్ చౌదరీ స్థానంలో వచ్చిన సిద్ధార్థ్ దేశాయ్ ను చరిత్రలోనే లేనంత ఖరీదుతో రూ.1.45 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో సిద్ధార్థ్ ప్రొ కబడ్డీ లీగ్ లోనే అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. హర్యానా స్టీలర్స్ 2018 సీజన్ లో మోనూగోయెత్ ను అత్యధికంగా రూ.1.5కోట్ల ధరకు సొంతం చేసుకుంది. దేశాయ్ గతేడాది ప్రదర్శన ఆధారంగా ఈ ఏడాది వేలంలో అతణ్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 2018 సీజన్ లో యూ ముంబా తరపున బరిలోకి దిగిన దేశాయ్.. 21 గేమ్ లలో అద్భుతమైన ప్రదర్శన చేసి 218 పాయింట్లతో మెప్పించాడు. గతేడాది సీజన్లో ముంబా సిద్ధార్థ్ దేశాయ్ కు రూ.36 లక్షలు మాత్రమే చెల్లించింది. సిద్ధార్థ్ తో పాటు అధిక ధర పలికిన ఆటగాళ్లలో మోనూ గోయెత్(రూ93లక్షలు), రఆహుల్ చౌదరి(94లక్షలు)లు ఉణ్నారు. అరంగ్రేట సీజన్ నుంచి రాణిస్తూ వచ్చిన రాహుల్ చౌదరి గతేడాది ముగిసిన సీజన్లో నిరాశపరచడంతో తెలుగు టైటాన్స్ అతణ్ని తప్పించింది.