ఎయిర్‌టెల్ భారీ డిస్కౌంట్!!!

SMTV Desk 2019-04-09 17:14:50  airtel, airtel network, sebi

ముంభై: ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్‌ ప్రతిపాదిత రైట్స్ ఇష్యూకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. దీంతో ఎయిర్‌టెల్ బోర్డు ఫిబ్రవరి నెలలోనే రూ.32,000 కోట్ల వరకు నిధులు సమీకరించాలనే ప్రణాళికలకు రంగం సిద్దం చేస్తోంది. బాండ్ల జారీ, రైట్స్ ఇష్యూ మార్గాల్లో ఈ మేర నిధులు రాబట్టాలని నిర్ణయించుకుంది. కంపెనీ రూ.32,000 కోట్లలో రూ.25,000 కోట్లు రైట్స్ ఇష్యూ ద్వారా, మిగతా మొత్తాన్ని బాండ్ల జారీతో సమీకరిస్తుంది. ఎయిర్‌టెల్ రైట్స్ ఇష్యూకు యాక్సిస్ క్యాపిటల్ మేనేజర్‌గా వ్యవహరించనుంది. రూ.220 ధరతో రైట్స్ ఇష్యూ ఉంటుంది. ఫిబ్రవరి 28 నాటి రూ.317.95 ధరతో పోలిస్తే రైట్స్ ఇష్యూ ధర 30 శాతం తక్కువగా ఉంది. కంపెనీ 1.14 బిలియన్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇకపోతే రైట్స్ ఇష్యూ వార్తల నేపథ్యంలో ఎన్‌ఎస్ఈలో మంగళవారం ఎయిర్‌టెల్ షేరు ధర మధ్యాహ్నం 12 గంటల సమయంలో 2.44 శాతం క్షీణతతో రూ.346 వద్ద ట్రేడవుతోంది.