ఐపిఎల్‌కు వరల్డ్‌కప్‌ టీమ్‌ ఎంపికకు సంబంధమే లేదు!

SMTV Desk 2019-04-09 17:10:48  ipl 2019, icc world cup 2019, chief msk prasad

ముంబై: ఐపిఎల్‌కు వరల్డ్‌కప్‌ టీమ్‌ ఎంపికకు సంబంధమే లేదని చీఫ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పష్టం చేశారు. ఈ నెల 15న ఈ మెగా టోర్నీ కోసం టీమ్‌ను ఎంపిక చేయనున్నారు. ఐపిఎల్‌ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారనే వార్తలకు ఎమ్మెస్కే చెక్‌ పెట్టారు. ఈ అంశంలో దాదాపు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయాన్నే ఎమ్మెస్కే వ్యక్తం చేశాడు. టీమ్‌లో నాలుగో నంబరు బ్యాట్స్‌మెన్‌పై సందిగ్ధత తొలగని కారణంగా ఇంకా టీమ్‌ సభ్యులను ప్రకటించలేదని అన్నారు. ఇప్పటికే తుది జట్టు ఎంపికపై సెలక్టర్లు ఓ అంచనాకు వచ్చేసినట్లు చీఫ్‌ సెలక్టర్‌ వెల్లడించారు.