బాయ్ ఫ్రెండ్ పెళ్లి అడ్డుకున్న మాజీ ప్రియురాలు....వైరల్ వీడియో

SMTV Desk 2019-04-09 17:09:42  china, ex-girlfriend stops her boyfriend wedding

బీజింగ్: చైనాలో ఓ వింత విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్న ప్రేమికులు విడిపోయి మరో అమ్మాయితో పెళ్ళికి సిద్దమైన తన బాయ్ ఫ్రెండ్ కు షాక్ ఇచ్చింది మాజీ ప్రియురాలు. అతడు గతం మర్చిపోయి ఇంకో అమ్మాయితో పెళ్లి చేసుకునే సమయంలో ఆ మాజీ ప్రేయసి వచ్చి, తనని పెళ్లి చేసుకోవాలంటూ అతడిని స్టేజ్ మీది నుంచి లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. తప్పు తనదేనంటూ ఆమె వేడుకుంది. వరుడు మాత్రం ఎంతకీ తాను రానంటూ మొండికేశాడు. ఈ తతంగం అంతా చూసి చిర్రెత్తుకొచ్చిన కొత్త పెళ్లి కూతురు స్టేజ్ మీది నుంచి వెళ్లిపోయింది. ఆమె వెంటే వరుడు కూడా వెళ్లాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముక్కోణపు ప్రేమకథ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటికే కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి.