ప్రముఖ నిర్మాతకు ఎంపీ సీటు ఆఫర్ చేసిన కేసీఆర్..?

SMTV Desk 2017-08-16 13:00:56  POLITICS, PRODUCER DILRAJU, CM KCR, MP KAVITHA

హైదరాబాద్, ఆగస్ట్ 16 : సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం సహజం. ఇప్పుడు అదే కోవలోకి అడుగుపెట్టారు ప్రముఖ నిర్మాత "దిల్ రాజు". స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తనకు ఎంపీ సీటు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత, రాష్ట్ర రాజకీయాల్లోకి రావడానికి భావిస్తున్న౦దున కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా కేసీఆర్ ఆహ్వాన౦పై దిల్ రాజు పాజిటివ్ గానే స్పందించినట్టు తెలిసింది. అన్ని అనుకూలంగా జరిగితే వచ్చే 2019 ఎన్నికల్లో దిల్ రాజు టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగడం ఖాయమని పార్టీ నేతలు అంటున్నారు. మరి ఈ విషయంపై దిల్ రాజు స్పందన ఎలా ఉంటుందో? చూడాలి మరి.