యూనికార్న్ క్లబ్‌లో డ్రీమ్11 రికార్డ్

SMTV Desk 2019-04-09 15:54:07  unicorn club, dream 11, online game, record

ప్రముఖ దేశీయ ఆన్‌లైన్ గేమ్ డ్రీమ్11 యూనికార్న్ క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. 1 బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన స్టార్టప్స్‌ను యూనికార్న్స్‌గా పేర్కొంటాం. డ్రీమ్11 ఫ్యాంటసీ కంపెనీ వ్యాల్యుయేషన్ 1.5 బిలియన్ డాలర్లలోపు ఉండొచ్చు. హాంగ్‌కాంగ్‌కు చెందిన స్టీడ్‌వ్యూ క్యాపిటల్ అనే సంస్థ డ్రీమ్11 కంపెనీలో వాటా కొనుగోలు చేసింది. దీంతో కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లపైకి చేరింది. కాగా చైనాకు చెందిన టెన్‌సెంట్ కంపెనీ ఏడు నెలల క్రితం డ్రీమ్11లో 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అప్పుడు కంపెనీ విలువ 700 మిలియన్ డాలర్లుగా ఉంది. కలారి క్యాపిటల్, మల్టీపుల్స్ అల్‌టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్, థింక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే సంస్థలు తమ వాటాలను స్టీడ్‌వ్యూ క్యాపిటల్‌కు విక్రయించాయని డ్రీమ్11 తెలిపింది. కాగా డ్రీమ్11కు 6 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.