నాంపల్లి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

SMTV Desk 2019-04-09 15:53:09  hyderabad, nampally railway station fire accident

హైదరాబాద్‌: హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్‌ 6లో నిలిచి ఉన్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నిలిచి ఉన్న రైలు కావడంతో పాటు రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు వెల్లడించారు.