మీ ఎఫ్16ను కూల్చింది ఇలాగే : ఇండియా

SMTV Desk 2019-04-09 15:49:12  pakistan f16, pakistan airforce, indian airforce, mig 21

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన మిగ్ 21 ...పాక్ ఎఫ్16 యుద్ధ విమానాన్ని ఈ విధంగా కూల్చివేసిందని సోమవారంనాడు ఎయిర్‌ఫోర్స్ అధికారులు సాక్ష్యాలు బయటపెట్టారు. పాక్ ఎప్పటినుంచో తమ ఎఫ్16 యుద్ధ విమానాన్ని భారత్‌కు చెందిన మిగ్ 21 కూల్చలేదని ప్రకటిస్తూ వస్తున్న వార్తలపై స్పందించిన ఇండియా ఈ నిజాలను వెల్లడించింది. కానీ వాటిని ప్రజాక్షేత్రంలోకి విడుదల చేయబోమన్నారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన డాగ్‌ఫైట్‌లో ఎఫ్16 విమానాన్ని కూల్చామని, దానికి కావాల్సిన ఆధారాలు అన్నీ పక్కాగా ఉన్నాయని వైమానికదళ అధికారి వైస్ మార్షల్ ఆర్‌జికె కపూర్ వెల్లడించారు. పాకిస్థాన్ దగ్గర ఉన్న ఎఫ్16 యుద్ధ విమానాల సంఖ్య తగ్గలేదని రెండు రోజుల క్రితం అమెరికా ఫారిన్ పాలసీ పత్రిక ఓ రిపోర్ట్‌ను వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్ స్పష్టమైన ఆధారాలతో వివరాలను బయటపెట్టింది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన డాగ్‌ఫైట్ తర్వాత.. భారత అధికారులు ఆమ్రామ్ క్షిపణి శిథిలాన్ని గుర్తించారు. ఆ రోజు జరిగిన పోరాటంలో రెండు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు నేలకూలాయని ఐఏఎఫ్ అధికారి చెప్పారు. దాంట్లో ఐఏఎఫ్‌కు చెందిన బైసన్ మిగ్ విమానంతో పాటు ఎఫ్16 ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అయితే పాక్ వాడిన ఎఫ్16 విమానానికి చెందిన ఎలక్ట్రానిక్ సిగ్నేచర్‌తో పాటు రేడియో ట్రాన్స్‌స్క్రిపట్స్ ఉన్నాయని అధికారులు తెలిపారు. డాగ్‌ఫైట్‌లో మిగ్ కూలడంతో దాని నుంచి పారాచూట్ సహాయంతో వింగ్ కమాండర్ అభినందర్ వర్ధమాన్ పాక్‌లో దిగాడు. ఆ తర్వాత పాకిస్తాన్ అతడ్ని భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.