వార్నర్ మరో రికార్డ్

SMTV Desk 2019-04-09 15:45:31  david warner, kane willaimson, srh, ipl 2019

మొహలి: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా సోమవారం మొహలి లోని బింద్ర స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో వార్నర్‌ అర్ధశతకం బాది, పంజాబ్‌పై వరుసగా ఏడు అర్ధశతకాలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో పంజాబ్‌ జట్టుపై ఆడిన మ్యాచ్‌ల్లో వరుసగా 58, 81, 59, 52, 70, 51, 70 పరుగులు చేశాడు. వరుసగా రెండు జట్లపై ఏడు అర్ధశతకాలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా వార్నర్‌ నిలిచాడు. ఈ ఐపిఎల్‌లో వార్నర్‌ ఆరు మ్యాచుల్లో 349 పరుగులు చేసి, ఆరెంజ్‌ క్యాప్‌ విజేతగా కొనసాగుతున్నాడు.