రజినీ 'దర్బార్' ఫస్ట్‌లుక్

SMTV Desk 2019-04-09 15:37:39  darbar, rajinikanth, ar muragadas, lyka productions, peta, anirudh

పేట సినిమాతో మాంచి ఫాంలో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ తన నెక్స్ట్ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘దర్బార్’ అనే పేరును ఖరారు చేసి ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదలచేశారు. మురగదాస్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ 10 నుండి మొదలు కానుంది. ముంబయి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫిసర్‌గా నటించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుంది. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్నీ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.