ఓటమి బాటలో హైదరాబాద్....పంజాబ్ ఘన విజయం

SMTV Desk 2019-04-09 15:32:11  srh vs kxip, ipl 2019

మొహలి: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా సోమవారం మొహలి లోని బింద్ర స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ను ఎంచుకోగా క్రీజులోకి వెళ్ళిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ (70 నాటౌట్: 62 బంతుల్లో 6x4, 1x6) అర్ధశతకం బాదడంతో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేశారు. ఈ లక్ష్యాన్ని కేఎల్ రాహుల్ (71 నాటౌట్: 53 బంతుల్లో 7x4, 1x6), మయాంక్ అగర్వాల్ (55: 43 బంతుల్లో 3x4, 3x6) హాఫ్ సెంచరీలు బాదడంతో ఒక బంతి మిగిలి ఉండగానే పంజాబ్ 151/4తో ఛేదించేసింది. గత శనివారం ఉప్పల్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హైదరాబాద్ టీమ్ ఓడిపోయిన విషయం తెలిసిందే.