సినిమా ఛాన్స్ అని చెప్పి డైరెక్టర్, హీరో లైంగిక దాడి!!!

SMTV Desk 2017-08-16 12:44:10  FILM CHANCE, DIRECTER, PRODUCER, RAPE ATTEMPT, MOVIE SHOOTING

విజయవాడ, ఆగస్ట్ 16 : సినిమాల్లో నటించే అవకాశాలు ఇస్తామంటూ యువతిపై అత్యాచారం చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. తనకు అవకాశాలు రాకపోయినా పర్వాలేదు కాని వారికి మాత్రం శిక్ష పడాలి అంటూ సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాలలోకి వెళితే... చిన్న చిన్న సీరియల్స్ లో నటించే హైదరాబాద్ కు చెందిన యువతి తనకు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం ఇస్తామంటూ తనను పిలిచారని తెలిపింది. అయితే తను రైలులో వెళ్ళవలసి ఉండగా, డైరెక్టర్ చలపతి, హీరో సృజన్ కారు తీసుకురావలసిందిగా తనను బలవంతం చేశారని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో కారు తీసుకెళ్లగా ముందు సీట్లో కూర్చున్న తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో వెనుక సీటుకు వెళ్ళినట్లు తెలిపింది. అయితే వారికి సహకరించనందుకు వారు ఆమెపై దారుణంగా దాడి చేశారని, ఎక్కడ కారు నుంచి దూకుతానో అని డైరెక్టర్ చలపతి అతి వేగంతో ముందున్న లారీని ఢీకొట్టాడు. దీంతో ఆసుపత్రిలో చేరిన తను ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపింది. అయితే నిర్మాతలు వచ్చి తనను షూటింగ్ నిమిత్తం భీమవరం తీసుకెళ్లారని, తన కారు గురించి అడుగగా షూటింగ్ పూర్తయిన తరువాత కారు ఇస్తామని బూతులు తిట్టారని తన గోడును వెల్లబోసుకు౦ది. ఈ విషయాలన్ని ఎవరికైనా చెబితే నీ కేరీరే నాశనమవుతుందని వారు హెచ్చరించినట్లు తెలిపింది. తనకు మాత్రం అవకాశాలు రాకపోయినా పర్వాలేదు కాని వారికి మాత్రం తప్పకుండా శిక్ష పడాలని ఆ యువతి పోలీసులకు వివరించింది.