నా కూతురి వయసు 14 సంవత్సరాలు, ఆమెను వదిలేయండి ప్లీజ్: అజయ్ దేవగన్

SMTV Desk 2019-04-09 15:23:00  ajay devgan, ajay devgan daughter, kajol,

ముంబై, ఏప్రిల్ 09: తన కుమార్తె వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమేనని, తన శరీరాకృతి, వేసుకునే దుస్తులపై ట్రోలర్స్ చేస్తున్న కామెంట్లతో ఆమె ఏడుస్తోందని బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ వాపోయారు.

తన పిల్లల ఫోటోలు తీసి వాటిని పబ్లిష్ చేయవద్దని మీడియాకు కోరిన అజయ్, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే నెగటివ్ కామెంట్లు వస్తున్నాయని అన్నారు. తనకున్న పాప్యులారిటీతో తన పిల్లలు బాధపడుతున్నారని, మీడియా శ్రద్ధ చూపిస్తుండటంపై వారు అసహనంతో ఉంటున్నారని అన్నారు.

మీడియా తీస్తున్న ఫోటోల్లో తాము ఎక్కడ సరిగ్గా కనిపించమేమోనన్న ఆందోళన వారిలో నెలకొని వుందని, పిల్లలన్న సంగతిని కూడా మరిచి అసభ్య కామెంట్లు పెడుతుంటే వాటిని చూసి బాధపడుతున్నారని అన్నారు. తాను, తన భార్య సెలబ్రిటీలం కాబట్టి ఏమన్నా పట్టించుకోబోమని, తమ పిల్లలు ఏం పాపం చేశారని ప్రశ్నించిన ఆయన, తన బిడ్డను వదిలేయాలని కోరారు.