హైదరాబాద్ పై ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్...

SMTV Desk 2019-04-09 13:25:36  srh vs kxip, ipl 2019

మొహలి: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు మొహలి లోని బింద్ర స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఇక టోర్నీలో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ మూడింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. మరోవైపు పంజాబ్ కూడా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరోస్థానంలో ఉంది. రెండు జట్లూ.. చివరిగా ఆడిన మ్యాచ్‌లో ఓడిపోయి ఒత్తిడిలోనే బరిలోకి దిగుతున్నాయి. గత శనివారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పంజాబ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌ స్టో ఇప్పటి వరకూ జట్టుకి మెరుపు ఆరంభాల్నిస్తూ బ్యాటింగ్ భారాన్ని మోస్తూ వచ్చారు. దీంతో.. మిడిలార్డర్‌ ఆటగాళ్లకి పెద్దగా పరీక్షలు ఎదురుకాలేదు. కానీ.. ముంబయితో మ్యాచ్‌లో.. అదీ కఠినమైన పిచ్‌‌పై ఆడాల్సి రావడంతో.. వారు చేతులెత్తేశారు. టోర్నీ లీగ్ దశలో ఇంకా 9 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో.. బ్యాటింగ్ ఆర్డర్‌ని మార్చి మనీశ్ పాండే, విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, దీపక్ హుడాలకి ఎక్కువ ప్రాక్టీస్ లభించేలా చేయాలని సన్‌రైజర్స్ టీమ్ ఆశిస్తోంది. మరోవైపు బౌలింగ్‌లో భువనేశ్వర్, మహ్మద్ నబీ లయ అందుకున్నా.. సందీప్ శర్మ, రషీద్ ఖాన్ తేలిపోతున్నారు. దీంతో.. ఈ ఇద్దరు బౌలర్లూ నిలకడ సాధించాలని హైదరాబాద్ టీమ్ ఆశిస్తోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నా.. మ్యాచ్‌లను గెలిపించలేకపోతున్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు బాదినా.. వేగంగా ఆడలేకపోవడంతో 22 పరుగుల తేడాతో పంజాబ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, ఓపెనర్ క్రిస్‌గేల్.. నిలకడలేమితో ఆ జట్టు ఆందోళనని రెట్టింపు చేస్తున్నారు. బౌలింగ్‌లో అశ్విన్, మురగన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఆండ్రూ టై రాణిస్తున్నా.. ఆ జట్టు పేలవ బ్యాటింగ్ కారణంగా మ్యాచ్‌లను చేజార్చుకుంటోంది.

Sunrisers Hyderabad (Playing XI): David Warner, Jonny Bairstow(w), Vijay Shankar, Manish Pandey, Deepak Hooda, Yusuf Pathan, Mohammad Nabi, Rashid Khan, Bhuvneshwar Kumar(c), Siddarth Kaul, Sandeep Sharma.

Kings XI Punjab (Playing XI): Lokesh Rahul(w), Chris Gayle, Mayank Agarwal, Sarfaraz Khan, David Miller, Mandeep Singh, Sam Curran, Ravichandran Ashwin(c), Ankit Rajpoot, Mohammed Shami, Mujeeb Ur Rahman.