‘కాంచన 3’కి సెన్సార్ పూర్తి

SMTV Desk 2019-04-09 13:24:26  kanchana 3, muni, raghava Lawrence, muni 4

దెయ్యాల సినిమాలు తీయడంలో తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్న దర్శకుడు రాఘవ లారెన్స్. ఈయన దర్శకత్వంలో వచ్చిన ముని సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాంచన 3’. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఇటీవల ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. రీసెంట్ గా రిలీజ్ అయిన చిత్రం ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. లారెన్స్ సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వేదిక , ఓవియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఏప్రిల్ 19న తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.