నష్టాల్లో ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు

SMTV Desk 2019-04-09 13:15:42  Sensex, Nifty, Stock market, Share markets

సోమవారం దేశీ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన సూచీలు ఆఖరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయాయి. చివరకు సెన్సెక్స్ 162 పాయింట్ల నష్టంతో 38,701 పాయింట్ల వద్ద, నిఫ్టీ 61 పాయింట్ల నష్టంతో 11,604 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, టీసీఎస్, పవర్ గ్రిడ్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, యూపీఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. అదేసమయంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐఓసీ, బజాజ్ ఫైనాన్స్, వేదాంత, బీపీసీఎల్, యస్ బ్యాంక్, గెయిల్, రిలయన్స్, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 2 శాతానికి పైగా పడిపోయింది. రిలయన్స్ కూడా దాదాపు 2 శాతం క్షీణించింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ఒక ఐటీ మాత్రమే లాభాల్లో ఉంది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు ఎక్కువగా నష్టపోయాయి.