లంబోర్గిని రేంజ్ లో మారుతీ బాలెనో మోడిఫైడ్ వెర్షన్

SMTV Desk 2019-04-09 13:02:18  maruti, maruti suzuki, maruti baleno,

భారత్‌లో ఎక్కువగా విక్రయమయ్యే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు మారుతీ బాలెనో. ఇందులో తాజాగా ఓ మోడిఫైడ్ వెర్షన్ ఒకటి అందుబాటులోకి వచ్చి అందరిని ఆకట్టుకుంటుంది. మారుతీ సుజుకీ బాలెనో కారును 360 మోటారింగ్ అనే సంస్థ మోడిఫైడ్ చేసింది. మోడిఫైడ్ కారు చూస్తే వావ్ అంటాం. అంత బాగుంది. చూపుకూడా తిప్పుకోలేం. ఎరుపు రంగు బాడీ, నలుపు రంగు టాప్, పక్షి రెక్కల లాంటి డోర్లు వంటి ప్రత్యేకతలతో అందరినీ ఆకట్టుకుంటోంది ఈ మోడిఫైడ్ బాలోనో కారు. కారు ముందు భాగంలో రీడిజైన్ బంపర్‌ను, అల్ బ్లాక్ గ్రిల్‌ను చూడొచ్చు. ఫాగ్ లైట్ సెక్షన్‌ను కూడా రివైజ్ చేసేశారు. వెనుక భాగంలో బంపర్‌ను కూడా కస్టమైజ్ చేశారు. డోర్లు లంబోర్గిని కారు స్టైల్‌లో ఉన్నాయి. ఇంకా ఈ కారులో పెద్ద 5 స్పోక్ అలాయ్ వీల్ డిజైన్, 17 అంగుళాల వీల్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇకపోతే మారుతీ బాలెనో కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. 1 లీటర్, 1.2 లీటర్, 1.3 లీటర్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర రూ.5.38 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. గరిష్ట ధర రూ.8.5 లక్షలు.