అభిమానిని వెంటపడి కొట్టిన నందమూరి బాలయ్య

SMTV Desk 2019-04-09 11:38:48  Balakrishna,

ప్రతిసారి తన అభిమానుల మీద చెయ్యి చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కే నందమూరి బాలకృష్ణ మరో మరు అదే కారణంతో వార్తల్లోకి ఎక్కాడు. ఈ ఎన్నికల ప్రచారంలో ఇప్పటి దాకా పెద్దగా చెయ్యి చేసుకోకపోయినా నోటి దురుసు వలన వార్తల్లోకి ఎక్కిన బాలయ్య ఇప్పుడు మాత్రం ఏకంగా ఒక వ్యక్తిని కొడుతూ ఉండడం తీవ్ర చర్చనీయాంశం అయింది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలయ్య నడిరోడ్డుపై అందరూ చేస్తుండగానే ఓ యువకుడి మీద దాడి చేశారు. బాలయ్య వెంటపడుతుంటే, ఆ యువకుడు పరిగెత్తాడు. కానీ బాలయ్య అతడి వెంట పరిగెత్తి మరీ దాడి చేశాడు. బాలయ్య అభిమానులపై దాడి చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో ఆయన అతి చేసిన ఫ్యాన్స్‌ చెంప చెల్లుమనిపించారు.