మృత్యుంజయుడు చంద్రశేఖరుడు

SMTV Desk 2017-08-16 11:11:22  Guntur, Bore well, Chandrashekhar, NDRF Rescue team

గుంటూరు, ఆగస్ట్ 16: వినుకొండ మండలం ఉమ్మిడివరం గ్రామానికి చెందిన మల్లికార్జున్, అనుష ల కుమారుడు చంద్రశేఖర్ మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో బోరు బావిలో పడ్డాడు. అనంతరం హుటాహుటిన బాలుడ్నికాపాడేందుకు ఎన్దీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అర్ధరాత్రి 2.40 నిమిషాలకి బాలుడ్ని బోరు బావినుండి బయటకుతీసారు. బాలుడ్ని ప్రాణాలతో చూడగానే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. అనంతరం తల్లితండ్రులు తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన ప్రతిఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా మన్నారు.