ఢిల్లీకి ఘన విజయం...కోహ్లీకి మళ్ళీ నిరాశే

SMTV Desk 2019-04-09 11:30:00  ipl 2019, dc vs rcb

ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజేర్స్ బెంగుళూరుతో ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. అయితే మొదట క్రీజులోకి వెళ్ళిన కోహ్లీ సేన 20 ఓవర్లకు 149/8 పరుగులు చేసింది. ఇక ఢిల్లీకి 150 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓటమి పాలైనా బెంగుళూరు ఈ మ్యాచ్ లోనూ ఓటమి పాలైంది. రెండు విజయాలు అందుకున్న ఢిల్లీ జట్టు 4 పాయింట్లతో ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. ఢిల్లీ కూడా చివరిగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం విశేషం. ఇక ఈ గెలుపుతో ఢిల్లీ 6 పాయింట్లతో ఉంటుంది.