'రంగీల’ నటి ఊర్మిళ పై కేసు

SMTV Desk 2019-04-09 11:21:20  urmila, congres

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ‘రంగీల’ నటి ఊర్మిళ మటోండ్కర్‌పై కేసు నమోదైంది. ‘హిందుత్వం అత్యంత ప్రమాదకరమైన మతం’ అంటూ హిందుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఓ టీవీ జర్నలిస్ట్‌పై కూడా ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సురేష్ నఖువా పేర్కొన్నారు.

‘‘ఏప్రిల్ 5న రాత్రి 8 గంటలకు నేను ఓ టెలివిజన్ చూస్తున్నాను. ఊర్మిళ మటోండ్కర్‌ మాట్లాడుతున్నారు. ఇంతలో ‘హిందుత్వం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మతం’ అని అన్నారు. దేశంలో హిందువులను ఆమె అవమానించారు. హిందువులను టెర్రరిస్టులుగా చూస్తున్నారు’’ అని సురేష్ పేర్కొన్నారు. ఊర్మిళపై భారత శిక్షా స్మృతిలోని 295ఏ, 505, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.