'మాన్కడింగ్' పై గవాస్కర్‌ కామెంట్స్...

SMTV Desk 2019-04-09 11:12:24  sunil gavaskar, sunil gavaskar about mankading, ashwin, kxip

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2019 సీజన్లో తాజాగా వెలుగులోకి వచ్చిన మాన్కడింగ్ అవుట్ పై వస్తున్న విమర్శలపై సునీల్‌ గవాస్కర్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....గత కొద్దిరోజులుగా భారత మీడియాలో వస్తున్న వార్తలు నన్ను చాలా బాధపెడుతున్నాయి. ఒక రనౌట్‌ను ‘మన్కడ్‌ పేరుతో జత చేసి మన దిగ్గజ క్రీడాకారుడిని అవమానిస్తున్నారు. ఎప్పుడో 70ల్లో జరిగిన మ్యాచ్‌లో నాన్‌స్ట్రైకర్‌ ఉన్న ఆస్ట్రేలియన్‌ క్రీజు వదిలి బాగా ముందుకు వెళ్లడంతో వినూ మన్కడ్‌ అతడిని ఔట్‌ చేశాడు. ఒక బద్ధకస్తుడైన విదేశీ జర్నలిస్ట్‌ ‘మన్కడెడ్‌ అని రాస్తే ఇప్పటికీ అదే స్థిరపడిపోయింది. బ్రౌన్‌ను అప్పటికే రెండు సార్లు మన్కడ్‌ హెచ్చరించినా కూడా అతను మారలేదు. మన్కడ్‌ చేసిన పనిలో తప్పేమి లేదని సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ కూడా అభిప్రాయపడినా దానిని ఇప్పటికీ మన్కడింగ్‌గానే పిలుస్తున్నారు. బ్యాట్‌కు బంతి తగిలిందని తెలిసినా క్రీజు వదలకుండా నిలబడే ఆటగాడిని ‘డబ్ల్యూజీ పేరుతో గుర్తు చేసుకోవడం లేదు కదా..! అలాగే బ్రియాన్‌ లారా ఇచ్చిన క్యాచ్‌ను నేలకు తాకిన తర్వాత అందుకొని ఔట్‌గా అప్పీల్‌ చేసినప్పుడు దానిని ‘స్టీవ్‌ వా పేరుతో పిలవడం లేదు కదా..! అలాంటప్పుడు హద్దు దాటిన నాన్‌స్ట్రైకర్‌ రనౌట్‌ చేస్తే దానికి మన్కడ్‌ పేరు ఎందుకు తగిలించాలి. అలాంటప్పుడు పైన చెప్పిన ఘటనలను ఎలా చూడాలి. అవి క్రీడాస్పూర్తికి అనుగుణంగా ఉన్నాయా. కనీసం ఇప్పుడు భారత మీడియా అయినా అలాంటి ఔట్‌ను ‘బ్రౌన్డ్‌ పేరుతోనన్నా పిలవాలి లేదా మామూలుగా రనౌట్‌ అని చెబితే చాలు అని అన్నారు.