రాంగోపాల్ వర్మ నటుడిగా అవతారమెత్తనున్నాడు

SMTV Desk 2019-04-09 11:03:53  rgv, ram gopal varma

సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ.. మరో సంచలనం సృష్టించనున్నాడు. ఇన్నాళ్లు దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, గాయకుడిగా ఉన్న ఆయన ఇప్పుడు తనలోని మరో కోణాన్ని బయటకు తీయనున్నాడు. ఆదివారం రాంగోపాల్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ ఆసక్తి కర విషయాన్ని వెల్లడించారు. ఇంతకు అదేంటంటే ?

వర్మ కొద్దిరోజుల్లో నటుడిగా మారబోతున్నాడు. గన్ షాట్ ఫిలింస్ సంస్థ తన తొలి ప్రయత్నంగా కోబ్రా అనే చిత్రాన్ని తీయనుంది. ఈ సినిమాతో రాంగోపాల్ వర్మ నటుడిగా అవతారమెత్తనున్నాడు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇన్నాళ్లు సంచలన దర్శకుడిగా పేరున్న వర్మ.. సినిమాలో తన నటనను చూపించి సంచలన నటుడిగా మారుతాడే లేదో చూడాలి. కొద్దిరోజులుగా వరుస ఫ్లాప్ ల చవిచూసిన వర్మ.. తాజాగా విడుదల చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో సెన్సేషనల్ హిట్ కొట్టాడు.