ఇకపై అమెరికాలోకి నో ఎంట్రీ....!!!!!

SMTV Desk 2019-04-08 21:20:01  america, donlad trump, indians

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన కాలిఫోర్నియాలోని కలెక్సికోలో సరిహద్దు గస్తీ బృందాలు, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అమెరికాలో వలసల వ్యవస్థ భారంగా మారింది. ఇక దీనిని ఉపేక్షంచ బోమని. ఇకపై కొత్తగా ఎవరికీ ఆశ్రయం ఇవ్వబోమని అయన స్పష్టం చేసారు మా దేశం నిండిపోయింది. అందుకే వెనుదిరిగి వెళ్లడం మంచిది. అని పేర్కొన్నారు. ట్రంప్‌ రాక సందర్భంగా మెక్సికో వైపు సరిహద్దు వద్ద మెక్సికలీ పట్టణంలో ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. ట్రంప్‌ను శిశువులా పేర్కొంటూ ఒక భారీ బెలూన్‌ను ఎగురవేశారు. దీంతోపాటు అమెరికా, మెక్సికో జెండాలను చేతపట్టుకొని కుటుంబాలను విడదీయవద్దు అనే ప్లకార్డులను ప్రదర్శించారు. అమెరికావైపు మాత్రం ట్రంప్‌కు మద్దతు లభించింది. విమానాశ్రయం నుంచి ఆయన కాన్వాయ్‌ వస్తున్నప్పుడు రోడ్డుకు ఇరువైపులా పదుల సంఖ్యలో ప్రజలు నిలబడి గోడ నిర్మించండి అని రాసిఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.వాషింగ్టన్‌ నుంచి బయల్దేరే ముందు ట్రంప్‌ మెక్సికోను పొగిడారు. గత నాలుగు రోజులుగా మెక్సికో చాలా బాగా సరిహద్దులను మూసివేసిందన్నారు. మెక్సికో అక్రమ వలసలను, మాదకద్రవ్యాల రవాణాను ఆపకపోతే ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై 25శాతం ఛార్జిలు విధిస్తామని హెచ్చరించారు. మెక్సికోపై టారీఫ్‌లు విధిస్తామని హెచ్చరించడం ఇదే తొలిసారి.