పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ గా మారారు

SMTV Desk 2019-04-08 21:15:47  Power Star, pacakge star, prudhvi, pawan kalyan

చంద్రబాబును, టీడీపీని భూస్థాపితం చేయాలని ఏపీ ప్రజలు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. పవన్ కల్యాణ్ రీల్ స్టార్, కేఏ పాల్ టీడీపీ పాల్. నాగబాబు, పవన్ మాట్లాడే భాషే సరైంది కాదు. నటన వేరు రాజకీయం వేరు. రాష్ట్రంలో జగన్ సీఎం కావాలని, రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పులి కడుపున పులే పుడుతుంది. పప్పు పుట్టదు. ఫ్యాన్ అసెంబ్లీలో ఉంటది… సైకిల్ స్టాండులో ఉంటది. గ్లాసు క్యాంటీన్ లో ఉంటది.. అని వైఎస్సార్సీపీ నాయకుడు, నటుడు పృథ్వీ వ్యాఖ్యానించారు.

భీమవరంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుతో కలిసి పృథ్వీ మీడియాతో మాట్లాడారు. రఘురామకృష్ణంరాజుపై దాడి అమానుషమని పృథ్వీ ఖండించారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనర్హుడని పృథ్వీ మండిపడ్డారు. ఆయన జీవితమే ఓ కాపీ అని ధ్వజమెత్తారు. ఆయన మేనిఫెస్టో చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు చంద్రబాబు మేనిఫెస్టో ప్రవేశపెట్టకుండా… జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని మార్పు చేసి ప్రవేశ పెట్టడమే దీనికి నిదర్శనమన్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ గా మారారు. 140 కిలోమీటర్ల వేగంతో ఫ్యాన్ తిరుగుతోంది. ఈ మూడు రోజులూ పరీక్షా సమయం. కులాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనతో కొన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని కులాల వాళ్లు జగన్ వెంటే ఉన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉంది నాకు అని చెప్పుకు తిరిగే చంద్రబాబు.. ఓ చిన్న సినిమాను చూసి భయపడటంతోనే ఆయన ధైర్యమేందో తెలిసిపోయిందన్నారు. ముస్లింల ఓట్ల కోసం ఫరూక్ అబ్దుల్లాను రాష్ట్రానికి తీసుకు వచ్చారు. ఎక్కడో ఉన్న ఏనుగును కడిగి ఆంధ్రాకు తీసుకువచ్చారని పృథ్వీ మండిపడ్డారు.