ఆర్సీబీపై ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ....

SMTV Desk 2019-04-08 21:11:05  rcb vs dc, ipl 2019

ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజేర్స్ బెంగుళూరుతో ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓటమి పాలైనా బెంగుళూరు ఎలాగైనా ఈ రోజు మ్యాచ్ ను సొంతం చేసుకునేందుకు కసితో ఉంది. రెండు విజయాలు అందుకున్న ఢిల్లీ జట్టు 4 పాయింట్లతో ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. ఢిల్లీ కూడా చివరిగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం విశేషం. దీంతో.. రెండు జట్లూ ఒత్తిడిలోనే బరిలోకి దిగుతున్నాయి.

Royal Challengers Bangalore (Playing XI): Parthiv Patel(w), Virat Kohli(c), AB de Villiers, Marcus Stoinis, Moeen Ali, Akshdeep Nath, Pawan Negi, Tim Southee, Navdeep Saini, Yuzvendra Chahal, Mohammed Siraj.

Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Rahul Tewatia, Colin Ingram, Chris Morris, Axar Patel, Kagiso Rabada, Ishant Sharma, Sandeep Lamichhane.