RX 100 టాప్ మోడిఫైడ్ బైక్స్

SMTV Desk 2019-04-08 21:07:31  RX 100, RX 135, YAMAHA, RX 100

యమహా RX 100 బైక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. అవి ఒకప్పుడు రోడ్లపై ఎంత హళ్ చల్ చేశాయో...ఇప్పుడు కూడా అదే రేంజ్ లో దూసుకుపోతున్నాయి. తక్కువ బరువు (లైట్ వెయిట్ బాడీ), అదిరిపోయే పనితీరు కనబరిచే 2 స్ట్రోక్ ఇంజిన్, ఈజీ రైడింగ్ వంటి అంశాలు ఈ బైక్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. యమహా కంపెనీ ఆర్ఎక్స్ 100 బైక్స్‌ తయారీని ఎప్పుడో నిలిపివేసింది. 2 స్ట్రోక్ ఇంజిన్, కొత్త ఉద్గార నిబంధనలు ఇందుకు కారణం. తయారీ నిలిపివేత తర్వాత ఇప్పుడు ఈ బైక్స్ ధర రూ.20,000 నుంచి రూ.70,000 వరకు పలుకుతోంది. బైక్ కండిషన్ ఆధారంగా ధర మారుతూ ఉండొచ్చు. అయితే ఆర్ఎక్స్ 100 బైక్స్‌లో చాలా మోడిఫైడ్ బైక్స్ అందబాటులోకి వచ్చాయి. వీటిల్లో టాప్ బెస్ట్ లుకింగ్ బైక్స్ ఏంటివో చూద్దాం..