మజిలీలో సమంత నటించకపోతే రిజల్ట్ వేరేలా ఉండేది

SMTV Desk 2019-04-08 21:00:32  Majili,

ఉగాదికి ఒకరోజు ముందు అనగా శుక్రవారం ఏప్రిల్ 5న రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది మజిలీ.నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ కూడా నటించింది. నాగ చైతన్య కెరియర్ లో సెకండ్ హయ్యెస్ట్ గా 5 కోట్ల ఫస్ట్ డే కలక్షన్స్ రాబట్టింది మజిలీ. ఇక సినిమాలో పూర్ణ పాత్రలో చైతు, శ్రావణి పాత్రలో సమంత అదరగొట్టారు.

పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి నటించిన సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ సినిమా కథ అనుకున్నప్పుడు పూర్ణగా చైతు కన్ఫాం అనుకున్న దర్శకుడు శ్రావణి పాత్రలో మాత్రం సమంతను అనుకోలేదట. ఆ పాత్ర పూర్తయ్యి చైతన్యతో చెబితే ఇది సమంత చేస్తే బాగుంటుందని అనగా ఫైనల్ గా అలా శ్రావణి పాత్ర సమంత దగ్గరకు వెళ్లిందట. కాని మజిలీలో సమంత నటించకపోతే రిజల్ట్ వేరేలా ఉండేది. ఎంతో సహజంగా తను ఎంచుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేసింది సమంత. ఆమె కాకుంటే ఆ పాత్రలో మరొకరిని ఊహించడం కష్టమే.