ఒవైసీ ముస్లిం కమ్యూనిటీని పిచోళ్లను చేస్తున్నారు

SMTV Desk 2019-04-08 20:59:25  Owaisi, AIMIM, shivaji

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణలోనూ వైసీపీ, తెరాస, ఒవైసీ అసదుద్దీన్ పని చేస్తున్నారని, అందుకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని సినీ నటుడు శివాజీ అన్నారు. కాగా, ఈ రోజు నిజం విత్ శివాజీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఇదే సమయంలో హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారని శివాజీ గుర్తుచేసారు. అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం కమ్యూనిటీని పిచోళ్లను చేస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఆ గుడ్ విల్ ని కెసిఆర్ తన రాజకీయ లబ్దికోసం వాడుకున్నారని శివాజీ అన్నారు.