యూట్యూబ్ ను షేక్ చేస్తున్న రావాలి జగన్.. కావాలి జగన్ పాట

SMTV Desk 2019-04-08 20:34:15  Youtube, Jagan, Rawali Jagan Kawali Jagan

రావాలి జగన్.. కావాలి జగన్.. ఇది పాట మాత్రమే కాదు.. ఏపీలోని ప్రతి ఒక్కరు తమ మనసులో పాడుతున్న పాట. అవును… ఏపీ జనాల్లోకి అంతలా ఎక్కిపోయింది ఈ పాట. పొలిటికల్ పాట ఇలా యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించడం అనేది చాలా అరుదు. రావాలి జగన్.. కావాలి జగన్ పాట మాత్రం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.



ఆ అరుదైన రికార్డును మాత్రం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సొంతం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన అధికారిక ప్రచార గీతం అది. ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ ఉర్రూతలూగిస్తోంది. వైఎస్ అభిమానులే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆ పాట తారకమంత్రంలా మారింది. యూట్యూబ్ లో షేర్ అయిన ఆ వీడియోకు ఇప్పటికే కోటిన్నరకు పైగా వ్యూస్ రావడం విశేషం.

మార్చి 8 న ఈ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ గీతాన్ని రచించారు. ఫిదా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు. గాయకుడు మనో ఈ పాటను పాడారు. ఈ పాటకు వస్తున్న స్పందనను చూసి ఇంగ్లీష్ న్యూస్ చానెళ్లు సైతం ప్రత్యేకంగా స్టోరీలు డిజైన్ చేసి.. ఆ పాటను తమ చానెళ్లలో ప్రసారం చేస్తున్నాయి.