ఐపీఎల్ మ్యాచ్‌లో కాంగ్రెస్ లీడర్..

SMTV Desk 2019-04-08 20:31:59  COngress, revanth reddy,

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతలంతా బిజీగా ఉన్నారు. రోజుకో నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ.. ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకర్గం నుంచి బరిలోకి దిగారు.

అయితే రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నారు. స్వల్ప స్కోర్లే నమోదైనప్పటికీ కావాల్సినంత వినోదాన్ని అందించింది. కాగా సినీ హీరో నాని, ఆయన సతీమణి అంజనా, ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ తదితరులు కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించి, అభిమానులతో సందడి చేశారు.