ఆ పార్టీ అభ్యర్థి కారుపై జనసేన కార్యకర్తల రాళ్ల దాడి

SMTV Desk 2019-04-08 17:32:13  Janasena, ysrcp

ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీల మాటలే కాదు, చేతలు కూడా వేడెక్కుతున్నాయి. ఏపీలోని నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కనుమూరి రఘురామకృష్ణం రాజు కారుపై జనసేన కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను పగలగొట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో ఈ రోజు రాత్రి దాడి జరిగింది. రాజు భద్రతా సిబ్బంది సకాలంలో దాడిని ప్రతిఘటించడంతో ఆయకు ముప్పు తప్పింది. దాడిలో ఆయన కారుతోపాటు మరో కారు అద్దాలు పగిలాయి. కాళీపట్నంలో జనసేన ఎన్నికల ప్రచార సభ జరుగుతున్న సమయంలో రఘురాజు కాన్వాయ్ అటుగా వెళ్లడంతో జనసేన కార్యకర్తలు దాడి చేరశారు. విషయం తెలుసుకున్న వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి రావడంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. రఘురామ కృష్ణం రాజు భీమవరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.