ఒక ఉడుత అంత పని చేసిందా?

SMTV Desk 2017-08-15 16:40:22  kolambia, Squirrel, Cheese company, electrical problem

కొలంబియా, ఆగస్ట్ 15 : ఓ ఉడుత ఒక పెద్ద కంపెనీ కొంప ముంచింది. అదేంటి? ఉడుత కొంప ముంచడమే౦టి? అని ఆశ్చర్యపోతున్నారా! అయితే అసలు విషయం తెలియాల్సిందే.. సాధారణంగా దొరికిన ప్రతిదానిని కొరుక్కు తినే ఉడుత ఎవరికీ ఎలాంటి హాని చేయదన్న సంగతి తెలిసిందే. అయితే బ్రిటిష్‌ కొలంబియాలోని బుర్నాబై నగరంలో అతి పెద్దదైన స్కార్డిల్లో చీజ్‌ కంపెనీ జున్ను తయారు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీలో వేలాది లీటర్ల పాలతో జున్నును తయారు చేస్తున్నారు. అప్పటికి ఆ కంపెనీలో 81 వేల లీటర్ల పాలు జున్ను తయారీకి సిద్ధంగా ఉన్నాయి. కాగా ఈ మధ్య ఒక ఉడుత ఆ కంపెనీ సమీపంలో ఉన్న ఓ విద్యుత్ తీగను కొరకింది. దీంతో ఆ కంపెనీకే కాకుండా ఆ నగరం మొత్తానికి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కనీసం జనరేటర్ వ్యవస్థ కూడా పని చేయకపోవడంతో దాదాపు 12 గంటలు ఆ కంపెనీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అంతరాయం వల్ల ఫ్రీజర్లు పని చేయలేదు. దీంతో ఆ పాలు ఉండాల్సిన ఉష్ణోగ్రతలో లేకుండా పోవడంతో జున్ను తయారీకి పనికి రాకుండా పోయాయి. దీని వల్ల వారం రోజుల ఉత్పత్తి ఒక ఉడుత వల్ల నిలిచిపోవడంతో ఆ కంపెనీకి భారీ నష్టం వాటిల్లింది.